Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 8:46 pm Posted by : ramakrishna

వేదిక్ మ్యాథ్స్, అబాకస్ లో విజ్ఞాన్ విద్యార్థుల ప్రభంజనం

 

ముప్కాల్, బతుకమ్మ :

 

హైదరాబాద్ లో ఆదివారం విశ్వం ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేదిక్ మ్యాథ్స్, అబాకస్ పోటీలలో విజ్ఞాన్ విద్యార్థులు అద్బుత ప్రతిభ చూపించారని పాఠశాల కరస్పాండెంట్ సోహెల్ తెలిపారు. ముప్కాల్ మండలంలోని విజ్ఞాన్ పాఠశలలో 8వ తరగతి చదువుతున్న సుహన వేదిక్ మ్యాథ్స్ లో, అలాగే 2వ తరగతి చదువుతున్న విహన్ అబాకస్ లో రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభను చూపించి బహుమతులు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయుల బృందం అభినందనలు తెలియజేసారు.