Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 8:45 pm Posted by : ramakrishna

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కార్యకర్తలదే

  • బిజెపి నూతన ఎమ్మెల్సీల అభినందన సభలో వక్తలు 

 

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కార్యకర్తలదే అని బిజెపి నూతన ఎమ్మెల్సీల అభినందన సభలో వక్తలు అన్నారు.  శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనార్దన్ గార్డెన్స్ లో భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అధ్యక్షతన  జరిగిన  బిజెపి నూతన ఎమ్మెల్సీల అభినందన సభలో  ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి,ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు  మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ సారథ్యంలోని  బిజెపి పార్టీ పరిపాలనను చూసి పలు దేశాలు అబ్బురపడుతున్నాయని, పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్,నేపాల్ వంటి దేశాలు ఆర్థికంగా

Victory in the MLC elections belongs to the activists.

అతలకుతలమై చాలా దీనస్థితిలో ఉన్నాయన్నారు. కానీ ప్రపంచానికి ఉపకండం లాగా ఉన్న  భారతదేశం ఆర్థికంగా రోజురోజుకు ఎదుగుతూ  అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భాజపా కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత  తమదని, సృష్టం చేశారు.   అనంతరం జిల్లా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నూతన ఎమ్మెల్సీలను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు  లోక భూపతిరెడ్డి, పద్మా రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, డాక్టర్ కొండ ఆశన్న, నాగోజి లక్ష్మీనారాయణ, ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, అంబదాస్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Victory in the MLC elections belongs to the activists.