Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2024, 8:15 pm Posted by : ramakrishna

విజయోత్సవ సంబరాలు

బతుకమ్మ, మోర్తాడ్:గత కొద్ది రోజులుగా ప్రభుత్వం విద్యుత్తు సంస్థలు ప్రజాభిప్రాయ సేకరణలో 18,500 కోట్ల విద్యుత్తు చార్జీలు ప్రభుత్వం పెంచకుండా ప్రజల పై భారం పడకుండా డిస్కం సంస్థలను ఒప్పించి మెప్పింనందుకు వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున బుధవారం రోజు మోర్తాడ్ మండల కేంద్రంలో పటాకులకు కాల్చి విజయోత్సవ సంబరాలు చేసుకున్న బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు. పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని బీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోపు 18,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని ఈ ఆర్ సి ని ఒప్పించగలిగారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షం యొక్క వాదనలోని సహేతుకతను, న్యాయాన్ని విని సంపూర్ణంగా చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈ ఆర్ సి తిరస్కరించడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఇలాంటి సందర్భం చారిత్రాత్మకం అన్నారు.
రాష్ట్ర ప్రజల పైన అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈ ఆర్ సి ముందు ఉంచడంలో బీఆర్ఎస్ విజయం సాధించామన్నారు.
పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు స్వయంగా కేటీఆర్ మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు రాష్ట్ర ఈఆర్సీ నీ కలిసి విద్యుత్ చార్జీల పెంపును ఆపాలని కోరారని, ఆ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారీ పాల్గొని ప్రజల తరఫున వాదనలను గట్టిగా వినిపించారన్నారు.ఈ ఆర్ సి ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతను, ప్రజాభిప్రాయ సేకరణను, ప్రధాన ప్రతిపక్షంగా తాము వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకొని ప్రజల పైన భారీ విద్యుత్ భారాన్ని మోపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించిన తీరు గొప్పదని పేర్కొన్నారు.
ప్రజల పైన భారీ విద్యుత్ భారం మోపకుండా ప్రజల పక్షాన నిలిచిన కేసీఆర్ ,కేటీఆర్ మాజీ మంత్రి ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి గారికి మరియు ఈ ఆర్ సి కి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలో అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ ,జడ్పీటీసీ PACS చైర్మన్ లు మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీలు ఉప సర్పంచులు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.