బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేరళ్ల గురడి కాపు సంఘం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద రుణమాఫీ ఇప్పటికి 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగి, త్వరలో 2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతులకు మాఫీ అవుతుంది అని అన్నారు. వరి వేస్తే ఉరి అనుకునె రోజుల నుండి వరి పంటకు క్వింటాలుకు 500 బోనస్ అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలో 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ద్వారా కుటుంబానికి దాదాపు నెలకు 10,000 రూపాయలు ఆదా అవుతుందని చెప్పారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే సమీకృత గురుకులాల ఏర్పాటు ద్వారా విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల కోసం ఆహార, కాస్మోటిక్ బిల్లులు పెంపుదల చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించామన్నారు. స్వయం సహాయక సంఘాలకు,పారిశ్రామిక వేత్తలకు రుణాలు ఇస్తున్నామన్నారు. అవినీతి ధరణి పోర్టల్ ను ఎన్ఐసీ జాతీయ సంస్థకు అప్పగింత ద్వారా అవినీతికి దూరంగా ఉంచామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను స్వేచ్చగా కలుసుకునే అవకాశం మీడియాకు స్వేచ్చ, మారక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందించామన్నారు. నియోజకవర్గానికి 3500-4500 చొప్పున రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలో కుటుంబ పాలన నడిచిందని 10 ఏళ్ళలో వారి కుటుంబం మాత్రమే బాగుపడిందని అన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదలకు సంక్షేమం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని అన్నారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికి ముఖ్యమంత్రి ఆదేశంతో నియోజకవర్గ ప్రజలకు బాధ్యతతో సేవ చేస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో గంజాయి, రౌడియిజం,గుండాయిజం లేకుండా చేసానని అన్నారు. సభ నిర్వహణకు ముందు భారి ర్యాలీ తో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్,మానాల మోహన్ రెడ్డి, కి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివనోళ్ల శివకుమార్,ఆడెం గంగ ప్రసాద్, రేండ్ల రమేష్ ముదిరాజ్, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, ముస్క మోహన్ రెడ్డి, బద్దంలింగారెడ్డి, జింక అనిల్, తాళ్ల రాంపూర్ బాను, మండల మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునీర్, మండల పరిధిలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.