బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండల పరిధిలోని మోర్తాడ్ టౌన్ లో ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా సెక్రెటరీ గిర్మాజీ గోపి, సీనియర్ నాయకులు వై శ్రీ, పట్టణ అధ్యక్షుడు పుప్పాల అశోక్, అర్గుల్ రమేష్, ఏఎంసి డైరెక్టర్ నవీద్, తాజా మాజీ ఎంపీటీసీ రాజ్పాల్, చొక్కాయి గంగారెడ్డి, వీడిసి అధ్యక్షుడు జక్కం అశోక్, జెడి చిన్న గంగారాం, పెద్ద గంగారం, శ్రీధర్, అశోక్, మోహన్, నాగభూషణం, లింగన్న తదితరులు పాల్గొన్నారు.