Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 7:00 pm Posted by : ramakrishna

గెలుపు ఓటములు సహజం

ముప్కాల్, బతుకమ్మ:ప్రతి ఆటల్లో గెలుపు ఓటములు సహజమని గెలిచినవారు పొంగిపోకుండ, ఓడినవారు కుంగిపోకుండా అందరు క్రీడాకారులు స్నేహ భావంతో మెలగాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ సొహెల్ అన్నారు. ఎస్ జీ ఎఫ్ అండర్ 14 బాల్కొండ జోన్ తరపున విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు పాల్గొని మంచి ప్రతిభ చూపించి జిల్లా స్థాయి లో వాలీబాల్ ఆటలో మొదటి బహుమతి సాధించినందుకు క్రీడాకారులను అభినందించారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయుల వద్ద తర్ఫీదు పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.