Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 11:39 am Posted by : ramakrishna

బ్యాంకు ఎజేంట్ మోసం పై బాధితుని నిరసన

. . .  బ్యాంకు ఎదుట అర్థ నగ్న నిరసన

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించిన ఇంకా డబ్బులు చెల్లించాలని ఎజేంట్ మోసం చేయడమే కాకుండా వేదిస్తున్నడని బాధితుడు కేనారా బ్యాంక్ ఎదుట నిరసనకు దిగాడు. నగరంలోని కేనారా బ్యాంకు ప్రధాన శాఖ ఎదుట జనార్థన్ అనే బాధితుడు అర్థనగ్నంగా కుర్చోని నిరసన తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన జనార్ధన్ అను వ్యక్తి కేనారా బ్యాంక్ లో ఫలు దఫాలుగా వ్యక్తగత రుణాలను పోందాడు. అందుకు తాలుకు డబ్బులను నవిన్ ( నందిపేట్) ఎజెంట్ ద్వార చెల్లింపులు చేశారు. ఐతే ఇటివల తన సిబిల్ స్కోర్   పడిపోవడం తో ఎజేంట్ ను నిలదియగా ఇంకా రుణాల తాలుకు డబ్బులు  చేల్లిస్తేగానే రుణాలు రావాని చెప్పడమే కాకుండా తనను బేదిరిస్తున్నడని వాపోయారు. ఈ విషయంపై పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా డబ్బులు చేల్లిస్తానని ఓప్పంధం రాసుకుని తప్పించుకు తీరుగుతున్నాడని బాధితుడు వాపోయారు. ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ వంశీని వివరణ కోరగా బ్యాంకులో క్లియరేన్స్ ఉన్నాయని, ఎజేంట్ ద్వార జరిగిన లావాదేవిల విషయంలో విచారించి  చర్యలు తీసుకుంటామన్నారు.