నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జీగా విక్కీ యాదవ్
నిర్మల్, బతుకమ్మ : నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇంచార్జీ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విక్కీ యాదవ్ నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర ఇంచార్జీలు సురభి, ఖలీద్, రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అందజేశారు. కొత్తగ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తానని, కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని నిర్మల్ జిల్లా ఇంచార్జీ విక్కీ యాదవ్ తెలిపారు.