Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 11:30 am Posted by : ramakrishna

ఉప రాష్ట్రపతి పోలింగ్.. తొలి ఓటు మోదీదే

డిల్లీ, బతుకమ్మ :   డిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంటు భవనం మొదటి అంతస్తులోని రూమ్ నంబరు ఎఫ్101 వసుధలో ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ను రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ కూటమి నుంచి సీపీ రాధాకృష్ణన్, విపక్ష కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికే పార్లమెంట్ భవనానికి చేరుకొని  తొలి ఓటు వేశారు.