Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 11:31 am Posted by : ramakrishna

తిరుమలలో పీఏసీ-5ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం

తిరుమల, బతుకమ్మ: తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ-5)ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా రూ.102 కోట్లతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఒకేసారి 4 వేల మందికి ఉచి వసతి సౌకర్యం కల్పించనున్నారు. 16 డార్మిటరీలు, 2,400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం ఇందులో ఉన్నాయి. అలాగే ఒకేసారి 80 మంది తలనీలాల సమర్పణకు వీలుగా  కల్యాణకట్ట ఏర్పాటు చేశారు. 1400 మంది భోజనానికి వీలుగా రెండు డైనింగ్ హాళ్లుఉన్నాయి. నూతన వసతి సముదాయంలో తొలి బుకింగ్ టోకెన్ ను వీరు భక్తులకు అందించారు. కాగా, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా 14 వ సారి బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి చంద్రబాబు  పట్టువస్త్రాలు సమర్పించారు.

Vice President, CM inaugurates PAC-5 in Tirumala