యునివర్సీటీ హాస్టల్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉపకులపతి

  డిచ్ పల్లి, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీకి చెందిన హాస్టల్ లను వైస్ చాన్సలర్ ప్రొ. యాదగిరి రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ లలో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. అంతేకాకుండా, స్వయంగా భోజనం చేసి పరిశీలించడం ద్వారా ఆహార నాణ్యతను ప్రత్యక్షంగా అంచనా వేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన వైస్ ఛాన్స్ లర్, హాస్టల్ లలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం...