Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 4:59 pm Posted by : ramakrishna

పశు వైద్య శిబిరం ప్రారంభం

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :

 

వర్ని మండల కేంద్రంలోని పాత వర్ని గ్రామంలో ఆదివారం పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో పీవీ నరసింహారావు పశు వైద్య కళాశాల కోరుట్ల, పశు వైద్య పశు సంవర్ధక శాఖ తెలంగాణ వారి సహకారంతో లయన్స్ 320 డి (ఎల్ సి వర్ని) ఆధ్వర్యంలో ప్రత్యేక కళాశాల వైద్య బృందం ద్వారా వివిధ వైద్య నిపుణుల సమక్షంలో పశువులకు అనేక రకాల జబ్బులను, ఆరోగ్య సమస్యలను, చర్మ వ్యాధి పరీక్షలు 12, పేడ పరీక్షలు 36 నిర్వహించారు. గర్భకోశ నిపుణుల సమక్షంలో తొలి దశ గర్భ చూడి నిర్ధారణను అల్ట్రా సౌండ్ స్కానర్ ద్వారా  57 నిర్ధారణ పరీక్షలు చేశారు. ఆవులు, గేదెలకు, ఆవు దూడలకు, గేదె దూడలకు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను వేశారు. ఈ కార్యక్రమంలో వర్ని ఏఎంసి చైర్మన్ సురేష్ బాబా, పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం కోరుట్ల డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్ డా.ఎం. ఉదయ్ కుమార్,  కళాశాల కోరుట్ల అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ కే. సుష్మ, నిజామాబాద్ జిల్లా పశు వైద్య, సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య, డాక్టర్ రోహిత్ రెడ్డి, సహాయ సంచాలకులు డాక్టర్ బసవరెడ్డి,  డా.జయశ్రీ, వెంకటేశ్, డా.చరిత, డా. మల్లేశ్, డా.శ్రీకాంత్, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

 

Veterinary camp begins