Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 June 2025, 4:58 pm Posted by : ramakrishna

దోస్త్ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో  2025-26 విద్యా సంవత్సరానికి  దోస్త్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి  రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి  పిహెచ్సి (దివ్యాంగులు), సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్సట్రా కర్క్యూలర్ ఆక్టివిటీస్)  విద్యార్థిని, విద్యార్థులకు   బుధవారం ధ్రువపత్రాల పరిశీలన  తెలంగాణ విశ్వవిద్యాలయం లో అడ్మిషన్స్ కార్యాలయంలో  ధ్రువపత్రాల పరిశీలన  జరుగుతాయి. ఈ ప్రత్యేక కేటగిరి  విద్యార్థిని విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లు రెండు సెట్లు జిరాక్స్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు తో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు హాజరు కాగలరని  దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు.