నేత్రానందంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడి కళ్యాణం

డప్పు చప్పుల్లతో స్వామివారి చిన్న రథం పై ఎదుర్కొల్లు జనసంద్రంగా మారిన స్వామివారి కల్యాణం   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్తీకమాసంలో ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ, గ్రామస్తులు కలిసి సోమవారం వేణుగోపాలుడి  కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. స్వామి వారి బాలాలయం నుండి ఉదయం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని చిన్న రథంపై డప్పు చప్పుళ్ల మధ్య  ఎదుర్కోలు నిర్వహించారు. ఎడ్ల అంగడిబజార్ లో కళ్యాణ మండపాన్ని...