కన్నుల పండుగగా వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం
బతుకమ్మ, నాగిరెడ్డిపేట : మండలములోని గోపాల్ పేట వేణుగోపాలస్వామి ఆలయంలో తొగిట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వేణుగోపాలస్వామి పల్లకి సేవను ఊరేగించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాధవ నంద సరస్వతి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. ప్రతి పని భగవంతునిపై విశ్వాసంతో చేయాలన్నారు. అనంతరం వేణుగోపాల...