Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 December 2024, 5:22 pm Posted by : ramakrishna

భవన నిర్మాణ కార్మిక రంగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా వేణు నియామకం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం జరిగిన భవన నిర్మాణ కార్మికుల అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ధర్పల్లి చంద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇదివరకు భవన నిర్మాణ రంగం జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన వేణు ను భవన నిర్మాణరంగం రాష్ట్ర కమిటీ లో చోటు లభించింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రకటించారు.