బోధన్ రోడ్డులో జాతీయ రహదారి 63పై వెంచర్
నుడా అనుమతి లేదని కొరడా కూల్చివేసిన నుడా అధికారులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి బోధన్ వెళ్లే రహదారిలో వెలిసిన వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో నుడా అధికారులు కొరడా ఝళిపించారు. 8 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో మంగళవారం నుడా టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రహారితో పాటు డివైడర్లను, హద్దురాళ్ళను తొలగించారు. బోధన్ రోడ్డులో నిజామాబాద్ నగర శివారులోని నెహ్రూనగర్ వద్ద ఏర్పాటు చేసిన వెంచర్ లో...