ఘనంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గల శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ యజ్ఞ పూజ శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయమును పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.