Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2024, 6:40 pm Posted by : ramakrishna

బోదన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన వేంకట నారాయణ

 . . . నిజామాబాద్ ట్రాఫిక్ సిఐగా వీరయ్య

 బతుకమ్మ, నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లాలో ఇద్ధరు సర్కిల్ ఇన్స్ పెక్టర్ ల బదిలీ చేస్తు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ ట్రాఫిక్ సిఐగా పని చేస్తున్న వెంకట నారాయణను బోదన్ పట్టణ సిఐగా బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. అయన బుదవారం బోదన్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు.  నిజామాబాద్ ట్రాఫిక్ సిఐగా  బోదన్ లో పని చేస్తున్న వీరయ్యను నియమించారు. గత నెలలో 8 మంది సిఐలకుబదిలీ చేసిన వారి పోస్టింగ్ లు తరువాత నిలిచిపోయాయి. కాని ట్రాఫిక్ సిఐ వేంకట నారాయణ  గతంలో జరిగిన బదీలలో ఎక్కడైతే పోస్టింగ్ ఇచ్చారో అక్కడికే తిరిగి పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం.