వేములవాడ రాజరాజేశ్వరునికి రూ.కోటీ 87లక్షల ఆదాయం

వేలములవాడ, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి 28 రోజుల్లో రూ.కోటీ 87లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అలాగే 115 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 9కిలోల 500 గ్రాముల వెండిని స్వామి వారికి భక్తులు సమర్పించినట్లు వివరించారు.