నేడు వేములవాడ రాజన్న కోడెల పంపిణీ
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: రైతులకు వేములవాడతిప్పాపూర్ రాజేశ్వర స్వామి గోశాలలోని 300 కోడెలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం సాయంత్రం 3గంటల నుంచి కోడెల పంపిణీ ప్రారంభమవుతుందని, అర్హులైన రైతులు పట్టాపాస్ పుస్తకాలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరో ఐదు కోడెలు మృతి వేములవాడ గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. ఆదివారం ఉదయం మరో ఐదు కోడెలు మృత్యువాత పడ్డాయి. దీంతో గోశాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా కోడెలు చనిపోతుండడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.