Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2025, 6:48 pm Posted by : ramakrishna

కొత్తపల్లి సర్పంచ్ గా వేములపల్లి రత్నాకుమారి ఎకగ్రీవ ఎన్నిక

 

మాక్లూర్, బతుకమ్మ :

మాక్లూర్ మండలం కొత్తపల్లి సర్పంచ్ గా వేములపల్లి రత్నాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మాక్లూర్ మండలం లో శనివారం  నామినేషన్ల ఉపసంహరణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాక్లూర్ మండలం లో కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా వేములపల్లి రత్నాకుమారి, కారు ముంచి కావేరి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సర్పంచ్ అభ్యర్థి కారుమంచి కావేరి గ్రామభి వృద్ధి కోసం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని వారు వివరించారు. గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.