నిధులు విడుదల చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపిన వేముల
బాల్కొండ, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గానికి ఎన్ఆర్ఇజిఎస్ నిధులు మంజూరు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా కలెక్టర్ కి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో సిసీ రోడ్స్, డ్రైనేజ్ ల నిర్మాణం కోసం ఎన్ఆర్ఇజిఎస్ పథకం ద్వారా రూ.5 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి.