Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2024, 12:58 pm Posted by : ramakrishna

గంజాయి కేసులు చేయించిన ఘనత వేములది

. కాంగ్రెస్ పై విమర్శలు తరువాత..

. ముందు మీ పార్టీని చక్కదిద్దుకోండి

. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులపై గంజాయి కేసులు నమోదు చేయించిన ఘనత మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిది అని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పై విమర్శలు చేయడం బీఆర్ఎస్ సిగ్గులేని తనానికి నిదర్శనమని, మరీ హీనంగా అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రశాంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీను టార్గెట్ చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. మొదలు బీఆర్ఎస్ పార్టీ ఇంటిని చెక్కపెట్టుకొనిఇతర పార్టీలపై విమర్శలు చేయాలని హితవు పలికారు. మరోసారి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పక తప్పదన్నారు. హైదరాబాద్ లో కేటీఆర్ బావమరిది నివాసంలో జరిగిన రేవ్ పార్టీపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో మైనార్టీ అధ్యక్షుడు జావిద్ అక్రం, కోనేరు గంగాధర్, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు వేణు రాజ్, నర్సింగ్ రావు, సర్దార్ నరేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.