Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 2:55 pm Posted by : ramakrishna

ఎఐకెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్, బతుకమ్మ :

రైతు పక్షపాతి, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడే జిల్లా వాసి వేల్పూర్ భూమయ్య అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐకేఎంఎస్ 9వ రాష్ట్ర మహాసభలు మంచిర్యాల పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో వేల్పూర్ భూమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై లోతైన  చర్చ చేశామని  ఆయన అన్నారు. కేంద్రంలోని ఆర్ఎస్ఎస్,బిజెపి ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వ్యవసాయ రంగంలో తీసుకువస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు, అమెరికా యురేపియన్ తో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు మొత్తం వ్యవసాయరంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నాయని అవి మరింత రైతాంగానికి ఉరితాళ్లుగా మారుతున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి వ్యవసాయరంగ సంక్షోభం ఎదుర్కొంటున్న,తీవ్ర అప్పులో కూరుకుపోతున్న రైతును మరింతగా కుంగదీస్తున్నాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో రైతులందరిని ఐక్యపరచి బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించేందుకు తగిన కార్యచరణ చేపట్టుతున్నామని ఆయన అన్నారు. దేశ వనరులను, సంపదను, భూములను మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతూ రైతును భూముల నుండి బేద కాల్ చేస్తుందని కార్మిక,ప్రజలను ఉపాధి నుండి దూరం చేస్తుందని విద్యార్థి యువకులను ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలను గురిచేస్తుందని ఎర్రన్న అన్నారు. ఈ నేపథ్యంలో ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభను తెలంగాణ గడ్డమీదనే ఈనెల 29,30,31 తేదీలలో ఖమ్మం పట్టణంలో నిర్వహించబోతున్నామని వారన్నారు. రైతులను రక్షించుకుందాం వ్యవసాయాన్ని కాపాడుకుందాం కార్పొరేట్ చేతుల్లోకి వ్యవసారంగాన్ని కట్టబెట్టే మోదీ ప్రభుత్వ విధానాలను సమరశీల ఐక్య రైతు ఉద్యమల ద్వారా మాత్రమే తిప్పికొట్టగలమని వారన్నారు. అందుకు దేశవ్యాప్తంగా రైతులందరూ ఐక్య అవుతున్నారని ఆ వెలుగు లో ఢిల్లీ తరహా రైతు ఉద్యమాలు వస్తాయని  వారు తెలిపారు.