వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ గా కొత్తింటి ముత్యంరెడ్డి, వైస్ చైర్మన్ గా గడ్డం నర్సిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పెర్కిట్ లోని తిరుమల గార్డెన్స్ లో ప్రమాణ స్వీకరోత్సవ సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్తం రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటాను అని అన్నారు. రైతులకు ఎల్లవేళలా అండగా ఉండాలని అన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 2,లక్షల రుణమాపీ పై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. రైతులెవరు అధైర్యపడొద్దని అన్నారు. గత పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల
రైతులు ఎలాంటి లబ్ధి పొందలేరని అన్నారు ధరణి ఆధారం చేసుకుని కెసిఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహెర్, రాష్ట్ర విత్తన అభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డి , మానాల మోహన్ రెడ్డి, బాల్కొడ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గడుగ్ గంగాధర్ అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు.
