- తాసిల్దార్ జె.మల్లయ్య
బతుకమ్మ,ఏర్గట్ల: మండలం లో ఎవరైనా ప్రభుత్వా అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే,ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, ఏర్గట్ల మండల తాసిల్దార్ మల్లయ్య తెలిపారు.అలాగే అట్టి ట్రాక్టర్ యజమానులపై మరియు డ్రైవర్లపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.కావున మండలంలో ఎవరికైనా ప్రైవేటు ఇండ్లకు, గాని,ఇందిరమ్మ ఇండ్లకు గాని ఇసుక అవసరం ఉంటే మండల తాసిల్దార్ కార్యాలయము లో తాసిల్దార్ మల్లయ్య ను సంప్రదించినట్లయితే.వారికి చట్ట ప్రకారము తగిన ఇసుక కూపన్ల ద్వారా ఇసుకను సరఫరా అనుమతి ఇవ్వడం జరుగుతుందని కావున మండల ప్రజలు గమనించగలరని తెలిపారు.