Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 6:01 pm Posted by : ramakrishna

అర్హులైన వికలాంగులందరికీ వాహనాలు అందజేయాలి

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అర్హులైన వికలాంగులందరికీ ప్రభుత్వం ప్రత్యేక వాహనాలు అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మహిళ శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుల ప్రత్యేక వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాటరీ వాహనాలకు మోక్షం కలిగిందన్నారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ వాహనాలు అందేలా చొరవ చూసుకోవాలన్నారు. తాను సైతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు కలిసి లేఖను అందజేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం అనేక పథకాలను అందజేస్తుందన్నారు. ప్రత్యేక పరికరాలతో పాటు రెండు లక్షల ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పద్మ, ప్రాజెక్ట్ అధికారి సౌందర్య, కార్పొరేటర్లు స్రవంతి రెడ్డి, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, న్యాలం సునీత రాజు, మురళి జ్యోతి, శశాంక్, నాయకులు పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.

 

Vehicles should be provided to all eligible disabled people.