పిడిఎస్ బియ్యం తరలిస్తున్న వాహనం సీజ్

  నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ మండల కేంద్రంలో అక్రమంగా పిడిఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని ఆంధ్రానగర్ గ్రామంలో పోలీసులు బొలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో వాహనంలో 57 బ్యాగుల్లో సుమారు 31 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, పత్రాలు వాహనంలో ఉన్న వ్యక్తుల వద్ద లేకపోవడంతో బియ్యంతో పాటు వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి...