బాన్సువాడ, బతుకమ్మ: పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు స్వాగతం పలికేందుకు నిజామాబాద్ బయల్దేరిన వాహన ర్యాలీని బాన్సువాడలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఇన్ చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి నిజామాబాద్ కు వస్తున్న మహేశ్ కుమార్ గౌడ్ కు ఘనస్వాగతం పలికేందుకు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లినట్లు తెలిపారు.