Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 December 2024, 6:45 pm Posted by : ramakrishna

వాహనాల తనిఖీలు

రుద్రూర్, బతుకమ్మ : ఇంచార్జ్ సీపీ సింధు శర్మ ఆదేశానుసారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రుద్రూర్ ఎస్ ఐ సాయన్న ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  స్పెషల్ పోలీసు బృందాలతో వాహనాలను తనిఖీ చేశారు. వాహనాదారుల ధ్రువపత్రాలు పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, సరైన ధ్రువపత్రాలు లేని వారికి ఎస్ ఐ సాయన్న జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.