కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ఏఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పట్టణ ఇనస్పెక్టర్ నరహరి, సిబ్బంది పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తా, పోలీసు స్టేషన్ ముందు, రైల్వే స్టేషన్ ఏరియా లలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెంబర్ ప్లేట్ వాహనాలను, మద్యం సేవించి వాహనాలను నడిపిస్తున్న వారి మీద పది డి.డి కేసులు, ఫైన్ వేశారు.
