Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 7:18 pm Posted by : ramakrishna

టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ

ఇందల్వాయి, బతుకమ్మ : స్థానిక సంస్థల నేపథ్యంలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర  సిఐ వినోద్ రెడ్డి, ఇందల్వాయి ఎస్సై సందీప్, ఎస్ఎస్టి టీం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా సిఐ వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రయాణాలు చేసేవారు ఎవరైనా 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్ళరాదని తెలిపారు. బంగారం తీసుకెళ్లిన సరైన పత్రాలు వెంబడే తెచ్చుకోవాలని తెలిపారు. లేనియెడల అటువంటి నగదు, బంగారం సీజ్ చేస్తామని తెలిపారు. ప్రజలు దీనిని గమనించి సహకరించాలని కోరారు.