నిల్చున్న వారిని ఢీకొన్న వాహనం : ఇద్దరి మృతి

బీబీనగర్, బతుకమ్మ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని.. అక్కడే నిల్చుని ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా పక్కనే ఉన్న చెరువులో పడి యువతి మరణించింది. వాహనంలోని ముగ్గరికి గాయాలు కావడంతో భువనగిరి ఆస్పత్రికి తరలించారు.