Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 5:55 pm Posted by : ramakrishna

16న ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

 

. . . ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఈ నెల 16న  వివిధ నేరాలలో పట్టుబడిన వాహానాలను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీఈఓ) ఆదేశాల ప్రకారం నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈ వేలం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ వేలాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నామని, వేలం పాటలో పాల్గొనే వారు రూ.5 వేలు ధరావత్తు చెల్లించి హాల్ టికెట్ పొందిన తరువాత మాత్రమే వేలం పాటలో పాల్గొనాలన్నారు. అందువల్ల ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత తేదీ, సమయానికి హాజరై వేలంపాటలో పాల్గొనాలన్నారు.