కేరళ రాష్ట్రంలో కూరగాయ పంటల సాగు భేష్

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాలక్కాడ్ జిల్లాలో కూరగాయల తోటలను సందర్శించిన రైతు కమిషన్ బృందం   హైదరాబాద్, బతుకమ్మ : కేరళ రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు కోసం అమలవుతున్న పాలసీ బాగుందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కౌలు రైతుల విష‌యంలో సైతం కేర‌ళ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విధానం ఆద‌ర్శ‌మ‌న్నారు. కేర‌ళ‌లో అమ‌ల‌వుతున్న విధానాల‌ను తెలంగాణ‌లో అమ‌ల‌య్యేలా రాష్ట్ర ప్ర‌భుత్వానికి సిఫార్సు చేస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సైతం కూర‌గాయ‌ల పంట‌ల సాగు విస్తీర్ణం పెంచ‌డానికి కృషి...