Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2024, 4:32 pm Posted by : ramakrishna

వీరవనీత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : వీరవనీత చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినాయకనగర్ విగ్రహాల పార్కులో గురువారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు.   ఈ సందర్బంగా ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు రాణి రుద్రమ్మ పౌరుషన్నిపాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దు బిడ్డ సాకాలి ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను దొర గుండాలు అక్రమంగా తీసుకెళ్తుంటే ఎదురు తిరిగి గుండాలను తరిమి కొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికెల చేసిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలో అనేక మంది ఆడబిడ్డల పైన అఘాత్యాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని శాంతి భద్రత విషయంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆడబిడ్డలకు రక్షణ లేకుండ పోయిందని ద్వజమెత్తరు. నేటి మహిళలు సాకాలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ రాణి లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అవరోదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.