వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

బతుకమ్మ,ఏర్గట్ల : మండల కేంద్రం ఏర్గట్ల లోని శివాజీ విగ్రహం వద్ద తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టపూర్ దయానంద్ నాయక్ మాట్లాడుతూ,చాకలి ఐలమ్మ అనగారిన వర్గాల ప్రజలతో పాటు సబ్బండ వర్గాల ప్రజల కోసం రజకారులు,దేశ్ ముఖ్, భూస్వాముల మీద ఎదురు తిరిగి భూమి కోసం,భుక్తి కోసం,ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసి పేద ప్రజల జీవితాలు మార్చడం  కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని...