ఆర్మూర్, బతుకమ్మ : బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో గురువారం అర్ముర్ పట్టణం లో “వీర్ బల్ దివాస్ ” కార్యక్రమం నిర్వహించారు. క్రీ,, పూ,, 1705 లో వాజిర్ఖన్ చేతులో వీర మరణం పొందిన గురు గోవింద్ పుత్రులు అజిత్ సింగ్, జుజర్ సింగ్, జోరవర్ సింగ్, ఫేతే సింగ్ చిత్ర పాటలకు పూలతో నివారులు అర్పించారు. వీరమరణం పొందిన బాల వీరుల త్యాగాలను స్మరించు కుంటూ వారికున్న దేశ భక్తి పట్ల ప్రాణ త్యాగం చెయ్యడానికి వెనుకడుగు వెయ్యలేదని, ఎందరో వీరుల చరిత్రను ఈ కాంగ్రెస్ పార్టీ వెలికి తీయకుండా చేసిందని, ప్రతి భారతీయ పౌరుడు చరిత్ర తెలుసుకొని దేశ భక్తి పెంపోందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి , వీర్ బల్ దివాస్ జిల్లా కో – కన్వీనర్ కలిగొట గంగాధర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్,జిల్లా నాయకులు బోట్ల విజయ్,పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్, ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు, పులి యుగేందర్, మందుల వీర బద్రి, యువమోర్చ నాయకులు మూర్తి, పోహార్ నవీన్, భారడి వినోద్ లు పాల్గొన్నారు.