నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సోమవారం ప్రకటించిన జేఇఇ ఫలితాల్లో వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. మామిడి నిశాంత్ రెడ్డి ఆల్ ఇండియా 1520 ర్యాంకు సాధించగా, వినాయక్ జోషి ఆల్ ఇండియా 3850 ర్యాంకు సాధించాడని కళాశాల ఛైర్మన్ మధు సూధన్ జోషి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు సంగం సంతోష్,కందోల్ల గజానంద్, కొండవీటి కార్తిక్ విద్యార్థులను అభినందించారు.

