Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 9:22 pm Posted by : ramakrishna

ఆల్ ఇండియా 1450వ ర్యాంకుతో వెక్టార్ హవా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జేఈఈ మేయిన్స్ – 2025 ఫలితాలలో వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుత విజయాలు సాధించారని కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి తెలిపారు. మామిడి నిశాంత్ రెడ్డి ఆల్ ఇండియా1450  వ ర్యాంకు(99.26%) సాధించి ఇందూరుకు ఘన కీర్తిని తెచ్చిపెట్టారన్నారు. అదేవిధంగా వినాయక్ జోషి(96.68%) తో ఆల్ ఇండియా 7054 ర్యాంకును, చంద్రవదన్ రెడ్డి(96.38%) తో ఆల్ ఇండియా7696 ర్యాంకును సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఒపెన్ కేటగిరి, ఓబీసీ కేటగిరి, ఈడబ్య్లూఎస్ కేటగిరి, ఎస్సీ ఎస్టీ కేటగిరీల్లో జేఈఈ అడ్వాన్స్ కు 25 మంది విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వెక్టార్  కళాశాల చైర్మన్ మధుసూదన్ జోషి విద్యార్థులను అభినందించారు.

Vector Hawa ranks 1450th in All India