వీడీసీలు చట్ట పరిమితులు దాటితే సహించేది లేదు
జిల్లా అదనపు సెషన్స్ జడ్జి భాస్కర్ రావు జక్రాన్‌పల్లి, బతుకమ్మ : గ్రామాభివృద్ధి కమిటీలు (వీడీసీ) చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేపడుతున్న చర్యలపై జిల్లా అదనపు సెషన్స్ జడ్జి భాస్కర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జక్రాన్‌పల్లి మండలంలోని కొలిపాక, జక్రాన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టపరమైన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి భాస్కర్ రావు మాట్లాడుతూ, “కుల బహిష్కరణలు, జరిమానాలు విధించడం వంటి చర్యలు...