వీడీసీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో గురువారం జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు సెషన్స్ జడ్జి భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి భాస్కర్ రావు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కమిటీలు (VDC) చట్టాన్ని చేతిలోకి తీసుకొని కుల బహిష్కరణ, జరిమానాలు విధించే కార్యక్రమాలను చేపడితే, అది చట్ట ఉల్లంఘనగా పరిగణించి కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు, న్యాయ వ్యవస్థలు ప్రజల...