Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2025, 6:46 pm Posted by : ramakrishna

వీడీసీలు పౌరుల జీవనవిధానానికి హానికరంగా మరాయి

  • సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు

 

ఆర్మూర్, బతుకమ్మ : గ్రామ అభివృద్ధి కమిటీలు పౌరుల జీవనవిధానానికి  హానికరంగా మరాయని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు.ఆర్మూర్ మండలం సూర్బీర్యాల్ గ్రామంలో గ్రామ సర్వజన సంగం విడిసి మాదిగ కులస్థులను సామాజిక బహిష్కరణ చేసిన విషయాన్ని బాధిత కుటుంబాలు న్యాయసేవ సంస్థకు పిర్యాదు చేసిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, గ్రామ రేవున్యూ ఇన్స్పెక్టర్ ప్రమోద్ లను తన కార్యాలయానికి పిలిపించుకున్న జడ్జి వారితో సామాజిక బహిష్కరణకు దారితీసిన పరిస్థులు, విడిసి ఆధిపత్య ధోరణి, చట్ట విరుద్ద చర్యలు లపై వారినుండి విషయ సేకరణ చేశారు. గ్రామస్థాయిలో అధికారులుగా ఉన్నవారు అదే గ్రామంలో కొందరు చట్టానికి అతీతంగా ఉంటు, మేము చెప్పిందే చట్టం అంటు ఉంటే పై అధికారులకు నివేదికలు ఇవ్వాల్సినవారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఎలా అంటు ప్రశ్నించారు.సుర్బీర్యాల్  విడిసి ఒక కులంనే లక్ష్యంగా చేసుకుని సాంఘిక బహిష్కరణ చేయడం నేరపూరిత చర్యేనని ఆయన అన్నారు.గ్రామంలో గ్రామస్థులందరి భాగస్వామ్యంతో నిర్మించిన మడిగెలను ఒక సామాజిక వర్గానికి ఇవ్వకుండా వ్యవహరించడం అన్యాయమేనని తెలిపారు. మడిగెలను గ్రామ పంచాయతీ అధికారిక అనుమతి ఉన్నదా లేదా తేల్సి ఒకవెల అనుమతి లేకుంటే నోటిస్ జారీ చేసి సీజ్ చేయాలని సూచించారు. విడిసిలు చట్ట వ్యతిరేకంగా వ్యవహారిస్తున్న  వ్యతిరేకించాల్సిన గ్రామాలలోని యువతలో చైతన్యం కానరావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సామాజిక రుగ్మతలపై స్పందించాల్సిన యువతరం, గ్రామాల విడిసిల దురగతాలపై ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ కార్యకలాపాలపై సమగ్ర నివేదికను తయారు చేసుకుని ఉన్నతాధికారులతోపాటు, న్యాయసేవ సంస్థకు అందజేయాలని తెలిపారు.విడిసి తిరోగమణ చర్యలకు చట్టంతోనే సరి చేయాల్సిన ఆవశ్యాకత ఉన్నదని అన్నారు.క్షేత్రస్తాయిలో విధులు నిర్వహించే పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, నీటి పారుదల అధికారులు అందరు తమకున్న అధికారాలను వినియోగించుకుని విడిసిల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి సహకరించాలని కోరారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహారిస్తున్న విడిసిలు కోర్టుల విచారణకు దొరికితే కారగార ఊచలను లెక్కించాల్సి ఉంటుందనే విషయాలు ఎరుక జేయాలని వారితో అన్నారు. ఏది ఏమైనా అందరితో కలగలసి పోవడం, కలుపుకుని  ముందుకు సాగడం అలవర్చు కోవాలని,విడిసిలు చట్టవ్యతిరేక పోకడలను విడనాడాల్సిన అవసరాన్ని విడమర్చి చెప్పాలని పేర్కొన్నారు.