గన్నారం గ్రామంలో మాదిగలను కుల బహిష్కరణ విధించిన వీడీసీ
.. మాదిగలపై దాడిని నిరసిస్తూ తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా ఇందల్వాయి,బతుకమ్మ : గన్నారం వీడీసీ కుల బహిష్కరణ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని మాదిగ కులస్తులు అవేదన వ్యక్తం చేశారు. మాదిగల పై దాడిని నిరసిస్తూ శుక్రవారం ఇందల్వాయి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా మాదిగలకు పట్టా కేటాయించిన భూమిని చదును చేసుకొని అందులో బోరు మోటర్ వేయడం జరిగిందన్నారు. వీడీసీ గ్రామ అభివృద్ధి కమిటీ వారు అట్టి భూమిని గ్రామానికి ఇవ్వాల్సిందిగా ఎస్సీ మాదిగలను...