Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 3:18 pm Posted by : ramakrishna

భారతీయుల్లో దేశభక్తిని నింపిన గేయం ‘వందేమాతరం’

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో ‘వందేమాతరం’ గేయం దేశభక్తిని నింపిందని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. భారత జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని  కంటేశ్వర్ డివిజన్లోని “వివేకానంద హై స్కూల్ “లో సామూహిక వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులతో కలిసి వందే మాతరం” గేయం సామూహిక గేయాలాపన వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. బంకించంద్ర చటర్జీ జ్ఞాపకార్థం, యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు వందేమాతర 150 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా  నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  వందేమాతర గేయం స్పూర్తితో స్వాతంత్య్రోద్యమం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవాకారులు  పోరాటంచేశారని పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ  కార్యక్రమంలో సౌత్ ఎంఈఓ సాయిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్,  బిజెపి కంటేశ్వర్ మండల్ ప్రెసిడెంట్  ఆనంద్ రావు, మేకల సాయి ప్రవీణ్, మఠం. పవన్,  ముండాడ, పవన్, బీజేపీ మండల ప్రెసిడెంట్ బాబీ సింగ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

'Vande Mataram' is the song that filled Indians with patriotism.