Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 2:30 pm Posted by : ramakrishna

వందేమాతరం ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని రగిలించింది

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్, బతుకమ్మ : వందేమాతరం అనే పదం ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో దేశభక్తిని రగిలించిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం  గీతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భం మనందరికీ గర్వకారణం అన్నారు. ఈ గీతం మన స్వాతంత్య్రసమరయోధులకు ప్రేరణ గా నిలిచినట్లే, నేటి తరం యువతకు దేశప్రేమ కర్తవ్యనిష్ట ఐక్యత అనే విలువలను స్ఫూర్తిగా అందిస్తుందని తెలిపారు.

Vande Mataram ignited patriotism in everyone's heart.

ఈ మహోత్సవ సందర్భంగా మన దేశపు తల్లి భూమికి మనమందరం వందనం చేయాలి. “వందేమాతరం ” అని ఆలపించడం కేవలం ఒక గీతం పాడడం కాదు, అది మన తల్లి దేశానికి ఇచ్చే గౌరవ ప్రధమైన ప్రమాణం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (ఎ.ఆర్) రామ చందర్ రావ్, ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, సి.సి.ఆర్.బి సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది, డి.పి.ఓ సిబ్బంది, హెడ్క్వార్టర్స్ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.

Vande Mataram ignited patriotism in everyone's heart.