నిజామాబాద్ కు త్వరలో వందే భారత్ రైలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన వందే భారత్ రైలు త్వరలోనే నిజామాబాద్ - ముంబై మధ్య ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎంపీ అర్వింద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాతో ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాల నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జిల్లాలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు వందే భారత్...