వనమహోత్సవం కరువైన ఉత్సాహం

మోర్తాడ్, బతుకమ్మ:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వనమహోత్సవంలో నిధులు లేక ఉత్సాహం కరువైంది. నర్సరీల్లో మొక్కలున్నాయి. గుంతలు తీసేందుకు, మొక్కలు నాటేందుకు కూలీలు సిద్ధంగా ఉన్నా నిధులు లేకపోవడంతో లక్ష్యం దిశగా వనమహోత్సవం సాగడం లేదు. జిల్లాలో మొక్కలు నాటడానిన జూలైలో ప్రారంభించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలతోపాటు చెరువులు, కాలువ కట్టలపై, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున 36 శాఖల సిబ్బంది ఉపాధి కూలీలతో మొక్కలు నాటడం ప్రారంభించారు. కానీ లక్ష్యం పూర్తి కాకుండానే మధ్యలో ఆగిపోయింది. రెండేళ్లలో జిల్లాలో హరితహారం...