భాజపా పార్టీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బి.ఆర్. శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆదికవి వాల్మీకి జయంతి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దళిత సమాజానికి చెందిన వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం గొప్ప కార్యమని, సామాజిక సమరసత్వం సనాతన ధర్మంలో ఎప్పటి నుంచీ ఉందని తెలిపారు. మధ్యలో కొంతమంది స్వార్థపరులు వారి ప్రయోజనాల...